హైదరాబాద్, చౌరాస్తా :-నలభై రోజుల వయస్సు శిశువును ఎలుక కొరకడంతో మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ పట్టణంలో చోటు చేసుకుంది. రాత్రి పడుకున్న సమయంలో ఎలుక చిన్నారి ముక్కు కొరకగా.. తీవ్ర రక్తస్రావమై చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.పట్టణంలోని నాగనూల్ ప్రాంతంలో నివసించే శివ, లక్ష్మికళ దంపతులకు 40 రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. రాత్రి నేలపై తల్లితో నిద్రిస్తున్న చిన్నారి ముక్కును ఎలుక కొరకింది. ఇది తల్లిదండ్రులు గమనించకపోవటంతో తీవ్ర రక్తస్రావమైంది.
శిశువు ఏడుపుతో నిద్రలేచిన తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే పట్టణ ఆసుపత్రికి తరలించారు. తరువాత పరిస్థితి విషమంగా ఉండటంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మధ్యాహ్నం చిన్నారి మృతి చెందాడు.ఈ ఘటన తల్లిదండ్రులు, కుటుంబీకులకు తీవ్ర విషాదం మిగిల్చింది.