‘..ఒరి నీయమ్మా.. బడవా.. ఏం దిది.. ఏందే.. ఇది.. ఇది నేనెప్పుడు జూడలే..’ అనే వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. మీరంతా చూసే ఉంటారు. అలాంటి ఫీలింగే కలుగుతోంది.. ‘నమస్తే Telangana पेप२..’ చూస్తే.. ఏంటీ తెలుగు, ఇంగ్లిష్, హిందీ అక్షరాలు పడ్డాయనుకుంటున్నారా.. నేను రాసింది కరెస్టే.. కావాలంటే నిన్నటి ‘నమస్తే తెలంగాణ’ చదవండి మీ తెలుస్తుంది..
మన భాష.. మన యాస ఏమైంది..
సమాజ చైతన్యంలో పత్రికలు, మీడియా పాత్ర ఎంతో కీలకం.. ఇది ఒకప్పటి మాట.. అంటే.. ప్రస్తుతం మీడియాలో ఉన్న కొందరికి కోపం రావచ్చు.. కానీ ఇది అక్షరాలా నిజం.. ఒకప్పుడు ప్రజల పక్షపాతిగా ఉన్న మీడియా రానురాను ఏదో పార్టీకి మౌత్ పీస్‌గా మారిపోయింది. అప్పట్లో రాజకీయం, మరేదన్న సమాచారం తెలుసుకోవాలన్న జనం పేపర్ చదివితే సరిపోయేది.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్కో పేపర్ ఒక్కో యాంగిల్.. ఎవరి యాంగిల్ వారిదే.. ఎవరి డబ్బా వారిదే.. ఈ సెల్ఫ్ డబ్బా వల్ల అసలు విషయాలు పక్కకు వెళ్లి పనికి రాని, పసలేని వార్తలతో రంగు కాగితాలు మార్కెట్లోకి వస్తున్నాయి.
ఇక ఆ రంగు కాగితాలను ‘సర్క్యూలేషన్’ పేరుతో చూపించుకోవడం కోసం యాజమాన్యాలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొన్ని బంపర్ డ్రాలతో ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తుంటే.. మరికొన్ని చందాలు, సెంటిమెంట్ల పేర్లతో లీడర్ల ఇళ్లకు చేరుతున్నాయి. ఇక అలాంటి పేపర్లలో జనానికి పనికొచ్చే వార్తలు ఏ పాటి ఉంటాయో మనందరికీ తెలుసు. ఇక ఇందులో వచ్చే వార్తలు చదివేందుకు జనం పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లార్జస్ట్ సర్క్యూలేటెట్ పేరున్న ఉన్న ‘ఈనాడు’ తెలుగు భాషను కాపాడుతున్నట్లు చెప్పకుంటూ చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. ఇంగ్లిష్ పదాలను .. ‘అంతర్జాలం (ఇంటర్నెట్), చరవాణి (సెల్‌ఫోన్), గృహ మంత్రి (హోం మంత్రి).. ముఖ పుస్తకం (ఫేస్ బుక్).. అంటూ తెలుగులోకి అన్వహించి తన పైత్యాన్ని ప్రజల మీదకు రుద్దుతుంటే.. ఇక ప్రభుత్వ కరపత్రంగా మారిన ‘నమస్తే తెలంగాణ’ ఏకంగా వేరే భాషలోనే వార్తలు వేయడం గమనార్హం..
గ్రేటర్ కనెక్టివిటీ కోసం..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం ‘నమస్తే తెలంగాణ’ ఎంతో శ్రమిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ మౌత్ పీస్‌గా మారిన పేపర్‌కు జనంలో పెద్దగా ఆధరణ లేకపోయినా.. బలవంతంగానైనా చదివించాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచి హైదరాబాద్‌లో రోజూ దాదాపు 3 లక్షల కాపీలను ఫ్రీగా పంచుతూ క్యాంపియన్ నడిపిస్తున్నట్లు సమాచారం. ఇందుకు స్థానిక ఏజెంట్లతో పాటు పక్క జిల్లాల్లో ఉన్న ఏజెంట్లు, మార్కెటింగ్ సిబ్బందిని వాడుతున్నట్లు తెలిసింది. కాపీలు పంపకం ఒక ఎత్తయితే అందులో కంటెంట్ కోసం రిపోర్ట్లు, డెస్క్‌లు పడే పాట్లు మరో ఎత్తు.. గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని రకాల కులాలు, మతాల వారు సెటిల్ అయ్యారు. వారికి అనుగుణంగా వార్తలు ఇయ్యాలె.. అందరినీ ఆకట్టుకోవాలె.. అని భావించిన యాజమాన్యం ప్రత్యేక పేజీలను అందిస్తోంది. అందులో శనివారం జరిగిన సీఎం కేసీఆర్ సభకు ఎక్కడలేని విధంగా కవర్ జీ ఇచ్చింది. అలా పనిలో పనిగా ఓ పేజీలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషల్లో ఐటెమ్స్ ఇచ్చారు. అవి చూసిన సగటు పాఠకుడు ఒకింత అవాక్కవ్వడమే కాదు.. ‘ఏం దిది.. ఇది నేనెప్పుడు జూడలే..’ అనుకుంటూ నవ్వుకున్నాడు.
మల్లి ఏందిరా.. గీ లొల్లి
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
పొమ్మనలేక పొగ పెడుతున్నరు..
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్