Tg Ministers : శ్రీ‘హరీ’ నీవేదిక్కు
మొక్కుల పేరుతో ముగ్గురు మంత్రులు (Tg Ministers ) తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్లడం ఇప్పడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. దేవుడి దగ్గరికి వెళితే హాట్ న్యూస్ ఏంటీ అనుకోకండి.. పోయినోళ్లలో టీఆర్ఎస్ సర్కారులో కీలక నేత, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఇటీవల మంత్రి వర్గంలో నుంచి ఉద్వాసన ఉంటుందని భావించిన బీసీ వెల్ఫేర్ మంత్రి గంగుల కమలాకర్, మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఉండడం గమనార్హం. సరే నిజంగా ఈ ముగ్గురు మంత్రులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెళ్లారనుకుంటే.. మంత్రి గంగుల ఇటీవలే తిరుపతికి వెళ్లి వచ్చారు. మళ్లీ మొక్కుల పేరుతో మరోసారి శ్రీవారి వద్దకు వెళ్లడం సర్వత్ర చర్చకు దారి తీస్తోంది.
కేటీఆర్ సీఎం ప్రచారం..
తర్వలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తారనే వార్తలు వస్తుండడం.. మంత్రివర్గ విస్తరణలో మార్పులు చేర్పులు ఉంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కేటీఆర్‌ను సీఎం చేస్తే ఆయన మంత్రి వర్గంలో ఎవరెవరు ఉంటారనేది మీద కేసీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్‌రావుకు కూడా కీలక బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులు హరీశ్, గంగుల, శ్రీనివాస్‌గౌడ్ తిరుపతి టూర్ ఆసక్తికరంగా మారింది. మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరిగితే పోస్టులు ఊస్ట్ అయ్యే లిస్టులో ఉన్న తమనుతాము కాపాడుకునేందుకు ఆ ఇద్దరు మంత్రలు పావులుకదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక తిరుపతి టూర్లో ముగ్గురు కలిసి ఎక్కడా పొటోలకు పోజులివ్వకపోవడం కాసింత ఆసక్తిని రేపుతోంది. గంగుల, హరీశ్ మాత్రమే స్వామివారి దర్శనం అనంతరం ఫొటో దిగారు. మొత్తానికి మంత్రులు వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ‘హరీ’ నీవే దిక్కు అని తిరుపతికి వెళ్లడం సర్వత్రా చర్చకు దారితీసింది.
ఏంది ఇది.. ఇది నేనెప్పుడు జూడలె
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్