Mega Family : మెగా ఫ్యామిలీలో కలకలం
మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపుతోంది. మెగా హీరోలు రాంచరణ్, వరుణ్ తేజ్ ఒకే రోజు కరోనా బారిన పడ్డారు. లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్న వీరికి పాజిటివ్ గా తేలింది. దీంతో వారు హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. తమకు కరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తమను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని కోరారు. త్వరలో కోలుకుని బయటకు వస్తామని పేర్కొన్నారు. నిహారిక మ్యారేజ్ కంటే ముందే నాగబాబుకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయి కోలుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ముగ్గురు మెగా హీరోలు కరోనా బారిన పడ్డారు.
పెళ్లిన రెండు వారాలకే..
మెగా ఫ్యామిలీ ఆడబిడ్డ నిహారిక వివాహం ఈ నెల 9 జరిగిన విషయం తెలిసిందే. గ్రాండ్గా జరిగిన ఈ వేడుకలకు మోగా ఫ్యామిలీతో పాటు ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీలో మెగా స్టార్ చిరంజీవి, రాంచరణ్ తో పాటు అంతా మంచి ఎంజాయ్ చేశారు. అయితే సాధారణంగా కోవిడ్ సోకితే దాదాపు 14 రోజుల వరకు లక్షణాలు కనిపించవు. పెళ్లి వేడుకలు జరిగిన రెండు వారాలకు మెగా ఫ్యామిలీలో (Mega Family) ఇద్దరు హీరోలు కరోనా బారిన పడడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. వారికి వైరస్ పెళ్లి వేడుకల్లోనే సోకిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కాక ఈ హీరోలు ఇటీవల క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొన్నారు. ఏదీ ఏమైనా రాంచరణ్, వరణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)