nandi teaser : అల్లరి నరేశ్.. సిరియస్ రోల్..
కామెడీ హీరో అల్లరి నరేశ్ ఇక సిరియస్ రోల్ కనిపించబోతున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో క్రైం, సస్పెన్స్ థ్రిల్లింగ్‌గా తెరకెక్కిన ‘నాంది’ సినిమా ట్రీజర్ను హీరో మహేశ్‌బాబు చేతుల మీదుగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘అందరూ నా జీవితం ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారు.. కాదు.. ఇప్పుడే మొదలైంది..’ అంటూ నరేశ్ చెప్పే డైలాగ్ అందరిలో ఆసక్తిని రేపుతోంది. చేయని నేరానికి శిక్ష అనుభవించే వ్యక్తి బాధలు, ఆ తర్వాత అతడి ప్రతీకారం ఎలా ఉండబోతోంది అన్నది సినిమాలోని కథాంశంగా తెలుస్తోంది.
‘రాజగోపాల్ గారిని నేను మర్డర్ చేయడం ఏంటీ సార్.. అసలు ఇప్పటి వరకూ రాజగోపాల్ గురించి వినడం తప్పా ఆయన గురించి నాకేం తెలీదు..’ అంటూ హీరో ఎమోన్షల్గా చెప్పే డైలాగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అసలు రాజగోపాల్ ఎవరు? ఆయనను హత్య చేసింది ఎవరు? నరేశ్ చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడా? అనే విషయాలు తెలియాలంటే.. ఫిబ్రవరి 19న వచ్చే ‘నాంది’ సినిమా చూడాల్సిందే.. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిలిమ్‌లో హీరో ప్రియదర్శి, వరలక్ష్మి శరత్‌కుమార్, హరీశ్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. nandi teaser