
Ap Ex minister : రాజకీయాలు వదిలి..
ఆయన మొన్నటి వరకు ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన కీలక నేత. సీఎం క్యాండిడేట్ అని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఏమైందో ఏమోగాని ఆ నేత ఇప్పుడు రాజకీయాలను వదిలి సామాన్యుడిలా జీవనం సాగిస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు..
ఈ ఫొటోలు ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.. సరిగ్గా గమనించండి ఈయన ఏపీలోని అనంతపురం జిల్లాలో తిరుగులేని కాంగ్రెస్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి.. (Ap Ex minister) 2004 నుంచి 2014 వరకు మంత్రిగా, 2014 నుంచి 2019 వరకు ఏపీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. ఏడాది కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ సాధారణ రైతు జీవితం గడుపుతున్నారు. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రఘువీరారెడ్డి ఓ సాధారణ వ్యక్తిలా టీవీఎస్ ఎక్సెల్‌పై వచ్చి ఓటేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు ఆయన ఫొటోలు, వీడియో సోషల్ మీటియాలో వైరల్ అయ్యింది.
https://twitter.com/drnraghuveera/status/1363505003709652995?s=19
మైనర్ వివాహంపై హైకోర్టు సంచలన తీర్పు
ఫాదర్ అయ్యాక.. బూతులు తగ్గించా.. బన్నీ