good news : జర్నలిస్టులకు శుభవార్త
జర్నలిస్టు మిత్రులకు శుభవార్త.. (good news ) రాష్ట్రంలో త్వరలో ఓ కొత్త టీవీ చానల్‌తో పాటు పత్రిక రాబోతోంది.. ‘హే.. ఊకో భయ్యా.. జోకులు చాలు గాని.. కరోనాతో పెద్ద పెద్ద సంస్థలే బిచానా సర్ధేసి.. డిజిటల్ వైపు పరుగుపెడుతుంటే.. మళ్లా పేపర్ వస్తందంటారా..! నిజమండి బాబూ.. నమ్మరా.. ఈ ముచ్చట నాలుగు రోజులుగా జర్నలిస్టుల గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది.. నాకు కూడా వచ్చింది.. కావాలంటే మీరే చూడండి..
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సంచలన నిర్ణయం
టీవీ9తో జర్నలిజానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన లెజెండ్ రవిప్రకాశ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త టీవీ చానల్‌తో పాటు, పత్రికను కూడా తీసుకురాబోతున్నారు. ఇందు కోసం రవిప్రకాశ్ ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేశారు. జర్నలిజంలో లెజెండ్‌గా ఎప్పటికీ చిరస్థాయిలో నిలిపోయే రవిప్రకాశ్ మరి కొన్ని రోజుల్లోనే కొత్త టీవీ ఛానెల్, పత్రికకు సంబంధించిన అనౌన్స్మెంట్ చేసే వీలుంది. రవి ప్రకాశ్ తీసుకురాబోతున్న కొత్త టీవీ చానెల్, ప్రత్రిక ఎవ్వరూ ఊహించని విధంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కొంత కాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తూ వస్తున్నట్టు సమాచారం. టీవీ9 నుంచి బయటకు వచ్చిన తర్వాత మైహోం గ్రూప్ రవి ప్రకాశ్పైన అనేక కేసులు పెట్టింది. ఆ కేసులన్నింటిలో ఇప్పటికే రవి ప్రకాశ్ పైచేయి సాధించారు. NCLT త్వరలో చెప్పబోయే తీర్పు కూడా రవి ప్రకాశ్‌కు అనుకూలంగా ఉంటుందనే సమాచారం ఉంది. అదే జరిగితే టీవీ9 మళ్లీ రవిప్రకాశ్ చేతికి రాబోతుందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రవి ప్రకాశ్ కొత్తగా లాంచ్ చేయబోయే చానల్ ఏంటి? పత్రిక ఏంటి? అవి ఎలా ఉండబోతున్నాయని అనే ఉత్కంఠ మొదలైంది.
… ఇదిన్న మాట అసలు విషయం..
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..