vakeel saab : దుమ్మురేపుతున్న వకీల్ సాబ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. రాజకీయాల్లోనికి వెళ్లిన పవన్ చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత ‘వకీల్ సాబ్’గా (vakeel saab) ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఏప్రిల్ 9న థియేటర్లలోకి వచ్చే పవన్ మూవీపై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా విడుదలకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే పవర్ స్టార్‌పై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు బయ్యర్లూ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 8వ తేదీ అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోల పేరుతో ప్రత్యేక ప్లాన్ చేస్తున్నారు. ఈ షోలకు రేటు ఎంత పెట్టినా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోరనేది వారి భావన.. ఈ స్పెషల్ షోలకు రూ.500 నుంచి రూ.1,500 వరకు ఏరియాను బట్టి రేట్లు ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే అభిమానులు కూడా రేటు ఎంతా సరే.. పవర్ స్టార్‌ను చూసుడే అంటున్నారు.
దుమ్మురేపుతున్న ట్రైలర్…
ఇక సోమవారం సాయంత్రం రిలీజ్ చేసిన ‘వకీల్ సాబ్’ ట్రైలర్ అభిమానులను ఎంతగానే ఆకట్టుకుంది. లాయర్ గా ముగ్గురు అమ్మాయిల పక్షాన పవన్ వాదిస్తున్న సీన్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ మరింత అంచనాలను పెంచింది.
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..