bhadhrachalam : కోటి గోటి తలంబ్రాలు
తిరుపతి లడ్డు.. మేడారం సమ్మక్క బంగారం.. అయ్యప్ప అర్వన్నం.. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా ఏదో ఓ ప్రసాదం తెచ్చి పంచడం మన సంప్రదాయం.. కానీ, భద్రాచలం (bhadhrachalam) రామూలోరి దర్శనానికి వెళ్లి వచ్చిన వారు మాత్రం స్వామివారి తలంబ్రాలను తెచ్చి ఇస్తారు.. అక్కడ తలంబ్రాలే స్పెషల్.. ఎందుకో తెలుసా..!
శ్రీరామ నవమి నాడు భద్రాచలంలో స్వామివారి కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. ధాన్యపు వడ్లను రోలులో దంచడమో లేక మిల్లులో మర పెట్టినవో కావు. మహిళలు తమ చేతి గోళ్లతో ఒక్కొక్క ధాన్యపు గింజను వలచిన బియ్యం అవి. అందుకే వాటిని ‘గోటి తలంబ్రాలు’ అంటారు. ఈ తలంబ్రాలు కోసం తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం అనే గ్రామంలో ప్రత్యేకంగా వరి సాగు చేస్తారు.. శ్రీరామ కళ్యాణ జరుగుతున్నప్పుడు తలంబ్రాలుతో పాటు వ్యవసాయానికి కావలసిన వడ్లను కూడా స్వామివారి పాదాల చెంత పెడతారు. ఆ వడ్లనే తిరిగి యథావిధిగా వరి సాగుకు వాడతారు. వరి సాగు మొదలు.. పైరు పెరిగాక వరి కోత కోసే సమయంలో ఆ పనుల్లో పాల్గొనే వారు శ్రీరామ, లక్ష్మణ, హనుమంత, సుగ్రీవ మొదలగు వేష ధారణలోనే ఉంటారు. కోత సమయంలో రామ నామం జపిస్తూ సంబురాలు చేసుకుంటారు. అందుకే ఎంతో పవిత్రంగా భావించే స్వామివారి తలంబ్రాలను తెచ్చి పంచుతారు.
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..