bigg boss 5 : ముచ్చటగా మూడో సారి
‘స్టార్ మా’ బిగ్ బాస్ సీజన్ 5కి రేడీ అయ్యింది. తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజీ ఉన్న ఈ ప్రోగామ్‌ను ఫస్ట్, సెకండ్ సీజన్లను ఎన్టీఆర్, నానిలతో హోస్టింగ్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత 3, 4వ రెండు సీజన్లు కింగ్ నాగార్జనతో హోస్టింగ్ చేయించింది. ఇప్పుడు సీజన్ 5కి కూడా ముచ్చటగా మూడో సారి ఆయననే ఎంపిక చేసింది. పంద్రాగస్టు సందర్భంగా రిలీజ్ చేసిన బిగ్ బాస్ (big boss) సీజన్ 5 ప్రోమోతో ఈ విషయం స్పష్టమైంది. బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత జనం బోర్ ఫీలింగ్‌లో ఉన్నారంటూ.. త్వరలో రానున్న సీజన్ 5తో మళ్లీ అంతా ఎంజాయ్ చేస్తారేనే విధంగా.. ‘బోర్ డమ్‌కు చెప్పండి గుడ్ బై.. ఇక వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 5’ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేలా ఉంది.
కాంటెస్టెంట్లపై ప్రచారం..
ఈ సీజన్ 5లో హౌజ్ ఉండే కాంటెస్టెంట్లపై ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారాలు బాగానే సాగుతున్నాయి. యాంకర్లు వర్షిణి, రవి, యానీ మాస్టర్, భాగ్య అలియాస్ ఉమ (కార్తీకదీపం సీరియల్ నటి), నటి లహరి, యూట్యూబర్ నిఖిల్, సిరి హన్యంత్, లోబో, ఆట సందీప్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఇప్పటికే కొంతమందిని సెలెక్ట్ చేసి రెండు డోసులు కరోనా టీకాలు వేసి క్వారెంటైన్ చేసినట్లు తెలిసింది.
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..