chiru : ఫ్యాన్స్‌కు ‘చిరు’ ఛాలెంజ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (chiru) తన జన్మదినం ఆగస్టు 22 సందర్భంగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొనాలని ట్విట్టర్ ద్వారా అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరిత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమన్నారు. ఇందుకోసం ఇటీవల ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన హరిత యజ్ఞం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో మీరంత పాల్గొని.. మూడు మొక్కలు నాటి, నాకు ట్విట్టర్ లో ట్యాగ్ చేయాలని చిరు విజ్ఞప్తి చేశారు.
చిరు ట్వీట్ పై స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్ మెగాస్టార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి పరిరక్షణపై మెగాస్టార్ కి ఉన్న ప్రేమను తెలియజేస్తుందని, ఆయన పుట్టిన రోజున అభిమానులంతా మొక్కలు నాటి చిరు కానుకను అందించాలని ఆకాంక్షించారు. తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలిచిన మెగాస్టార్ ఆయురారోగ్యాలతో కలకాలం అభిమానులను అలరించాలని ఆకాంక్షించారు.
We all owe it to Mother Nature. To fight climate change & air pollution, let's plant saplings & grow trees.This year, I urge all my loving fans to plant 3 saplings on my birthday to show your love & tag #HaraHaiTohBharaHai to support #GreenIndiaChallenge campaign. @MPsantoshtrs
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 21, 2021
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..