bigg boss 5 : ఎవరు ఏ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తున్నారో తెలుసా..
బిగ్‌బాస్ ఐదో సందడి మొదలైంది. తెలుగులో రియాలిటీ షో బిగ్‌బాస్ (bigg boss 5) ఐదో సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం ఈ ప్రోగ్రాం అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరు అన్నది అందరికి ఆసక్తి మొదలైంది. కొన్ని రోజుల క్రితం పుకారు ప్రకారం కంటెస్టెంట్స్ వారేనా ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా .. నేడు ఎవరెవరు అందులో ఉండబోతున్నారని తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ షో శనివారమే ప్రారంభమైంది. ఆ నాడే పాల్గొనే వారు ఇంట్లొకి వెళ్లారు. వారిలో యాంకర్ రవి, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టార్, యూట్యూబర్ సరయు, యానీ మాస్టార్, ఆర్జే కాజల్, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, సీరియల్ హీరో మానస్, నటి శ్వేత వర్మ, లహరి హౌస్‌లోకి వెళ్లినట్లుగా సమాచారం.
ఇక ఆదివారం సాయంత్రం ప్రసారం కాబోయే ఎపిసోడ్ ను కూడా శనివారమే షూట్ చేశారట. దాంట్లో ఏ కంటెస్టెంట్ ఏ పాట మీద డ్యాన్స్ చేశారు అనే దానిపై కూడా పలు గుసగుసలు వినిపిస్తోన్నాయి. పవన్ కళ్యాణ్ ఆరడుగుల బుల్లెట్టు అనే పాటకు సీరియల్ హీరో మానస్..డ్యాన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. పుష్ప పాటకు నటరాజ్ మాస్టర్ , సరైనోడు పాటకు యాంకర్ రవి , ఇక యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్…లోబో పాగల్ సినిమా పాటకు, లహరి షారీ అర్జున్ రెడ్డి పాటకు నేనొక్కడినే వూఆర్ యూ అనే పాటకు .. బద్దల్ పాటకు సిరీ హన్మంత్ బూమ్, తెలుసా, తెలుసా పాటకు,యానీ మాస్టర్, గోపికమ్మ పాటకుఇక ప్రియాంక సింగ్, ధీవర పాటకు శ్వేత వర్మ డ్యాన్స్ చేసినట్టు సమాచారం. ఈ ఉత్కంఠకు కొన్ని అవర్స్‌లో తెరపడనుంది.
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..