top 5 contestants : టాప్-5లో ఉండేది వారేనంట.. సోషల్ మీడియాలో ఫుల్ సపోర్టు
తెలుగు బిగ్ బాస్ సీజన్-5 స్టార్ట్ అయి ఒక్క వారం కూడా కాకుండానే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం బిగ్బాస్ మీద ఫోకస్ పెట్టేసింది. అప్పుడే ఎవరు విన్నవుతారో అంటూ ట్రోలింగ్ కూడా సాగుతోంది. ఇక ఇప్పటి వరకు మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో ఆట స్టార్ట్ అయింది. ఇక గత సీజన్ లలాగే ఇప్పుడు కూడా కొందరు కంటెస్టెంట్స్ విషయంలో సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ వస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ చూడని కొందరి మొహాలు మొదటి సారి చూడటం వల్ల ఇలా జరిగినట్టు తెలుస్తోంది. అసలు వీళ్లంత ఎవరు అన్నట్లుగా అప్పుడే సోసల్ మీడియాలో వారి మీద మీమ్స్ పేలుతున్నాయి. కాగా అయితే కంటెస్టెంట్స్ మొదట్లో కొంత కొత్తగా కనిపించినా కూడా చివరకు వారి ప్రవర్తనే వారిని విజయ తీరాలకు చేరుస్తుంది.
అయితే ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన 19మందిఓ కేవలం కొందరికే టాప్ 5లోకి వెళ్తే సత్తా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే వారి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్ నడుస్తోంది. ముందుగానే ఈ ఐదుగురు అందరికీ బాగా పరిచయం ఉన్న వారు కావడం గమనార్హం. అయితే వీరితో పాటు కొందరు కొత్త కంటెస్టెంట్స్ కూడా టాప్ 5దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక అందరిలో కెల్లా మంచి ఫేమ్ యాంకర్ రవికే ఉంది. కాబట్టి ఆయన కచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. ఇక ఆయనతో పాటు సన్నీ, అలాగే విశ్వతో పాటు షణ్ముఖ్ జశ్వంత్ కూడా ఫైనల్ వరకు వెళ్తాడనే ట్రోలింగ్ నడుస్తోంది. ఇక మానస్ కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. వీరితో పాటు అమ్మాయిల విషయానికి వస్తే సిరి, సరయు, ఆర్ జే కాజల్, ఆని మాస్టర్ టాప్ 5లో ఉంటారని టాక్. చూడాలి మరి ఎవరు వెళ్తారో.
గర్భవతిని వదిలేసి వచ్చిన నటరాజ్
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..