bigg boss siri : సిరిని ఆకాశానికి ఎత్తేస్తున్రు
ఇప్పుడు బిగ్బాస్ తెలుగు సీజన్-5 టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతోంది. స్టార్ట్ అయి రెండు రోజులు కూడా కాకముందే సోషల్ మీడియాను ఊపేస్తోంది. అప్పుడే కంటెస్టెంట్ల విషయంలో ట్రోలింగ్లు, సపోర్టులు నడుస్తున్నాయి. ఇక హౌస్లోకి అడుగు పెట్టిన 19మంది కంటెస్టెంట్ల విషయంలో ఒక్కొక్కరి మీద ఒక్కో రకంగా సోషల్ మీడియా లో ప్రచారం సాగుతోంది. అయితే ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సిరి. అదేనండి యూట్యూబ్ లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత జబర్దస్త్ లో కూడా సందడి చేసిన సిరి హనుమంతు.
పొట్టిపిల్ల అంటూ ఆమెను (bigg boss siri) అభిమానిస్తుంటారు చాలామంది. గత నాలుగు అయిదు నెలలుగా మిగతా వారికంటే కూడా ఈమె గురించే ఎక్కువగా బిగ్ బాస్ లో ఉంటుంది అంటూ ప్రచారం సాగుతోంది. ఇలాంటి తరుణంలోనే ఆమెనే మొట్ట మొదటి కంటెస్టెంట్ గా గ్రాండ్ ఎట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి ఆమె తన డాన్స్, ఎనర్జిటిక్ ఫెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. అన్ని విషయాల్లో సిరికి మంచి మార్కులు పడుతున్నాయంటే ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కూడా అర్థమయిపోతోంది. టాప్ 5 కి వెళ్లే ఛాన్స్ సిరికి కచ్చితంగా ఉందనే చెప్పాలి. ఇక ఆమె తోపు కచ్చితంగా టాప్5కి ఈజీగా వెళ్తుంది అంటూ ట్విట్టర్, ఇన్ స్టా లో ఓ రేంజ్లో ప్రచారం జరుగుతోంది. మిగతా కంటెస్టెంట్ల కంటే కూడా ఆమె గురించే ఎక్కువగా ప్రచారం సాగుతోంది. మరి ఆమె ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
గర్భవతిని వదిలేసి వచ్చిన నటరాజ్
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..