revanth reddy : యముడి గెటప్‌లో టీపీసీసీ చీఫ్!
నెట్టింట రేవంత్ ఫొటోలు వైరల్
సాధారణంగా భారీ కటౌట్లు సినీ హీరోలకు థియేటర్స్ ఎదుట అభిమానులు పెట్టడం మనం చూడొచ్చు. రాజకీయ నాయకులకూ కటౌట్లు పెట్టే అభిమానులున్నారు. తాజాగా గజ్వేల్‌లో జరిగిన ‘దళిత, గిరిజన దండోరా సభ’లో ఓ కటౌట్ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. ఇంతకీ ఆ కటౌట్ ఎవరిదంటే..
టీపీసీసీ చీఫ్, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి (revanth reddy) యముడి గెటప్‌లో టీపీసీసీ చీఫ్! కటౌట్‌ను గజ్వేల్ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ‘యమదొంగ’ సినిమాలో యముడిగా కనిపించే జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లో ఎన్టీఆర్ ఫేస్‌కు బదులుగా రేవంత్ ముఖాన్ని పెట్టి కటౌట్ ఏర్పాటు చేశారు. కందుకూరు జడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి ఈ కటౌట్‌ను ఏర్పాటు చేయగా, దీని కిందఆబఅని ముద్రించారు. ఈ కటౌట్ చూసి కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కటౌట్ ఫొటోలు నెట్టింట వైరలవుతుండగా, వాటిని చూసి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘రేవంత్ ద లీడర్, కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకుడు’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
గజ్వేల్ సభలో తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని రేవంత్ పిలుపునిచ్చారు. సీఎం సొంత ఇలాకాలో రేవంత్ ఆయనపై ఫైర్ అయ్యారు. వేలాది మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు. గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి అంతా గీతారెడ్డి హయాంలోనే జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులకు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం తీసుకొస్తే, గులాబీ అధినేత కేసీఆర్ దానిని నీరుగార్చారని ఆరోపించారు. పేదల, విద్యార్థులు, దళితుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేస్తున్నారని, ప్రజలు ఈ విషయాలు గుర్తించారని వివరించారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కు తగిన గుణపాఠం తప్పదన్నారు.