White challenge : వైట్ ఛాలెంజ్‌కు రెడీనా!
రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నా వేల రాజకీయ నాయకులు విమర్శల కత్తులు నూరుతున్నారు. ఇప్పటి వరకు గ్రీన్ ఛాలెంజ్ అంటూ చెట్లు నాటిన వాళ్లు ఇప్పుడు వైట్ ఛాలెంజ్ బాట పట్టారు. సినిమా తారలతో మొదలైన డ్రగ్స్ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి ఇప్పుడు రాజకీయ నాయకులకు వైట్ ఛాలెంజ్‌ను తెచ్చిపెట్టింది. అసలే కేసీఆర్ అంటే చాలు రెచ్చి పోయె రేవంత్ ఇప్పుడు కేటీఆర్ ను టార్గెట్ చేశారు. దేనికైనా సిద్ధమే అంటూ గన్ పార్క్ దగ్గర ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర ధర్నా కూడా చేశాడు.
అయితే డ్రగ్స్ దందా విషయం ఏమో గానీ ట్విట్టర్లో మాత్రం పోస్టుల వార్ నడుస్తోంది. రేవంత్ మాటలకు ktr ఏకంగా పరువు నష్టం దావా వేయడం రాజకీయ దుమారం లేపింది. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత ప్రాంతంగా చేయాలని, అందు కోసం మొదట ప్రజాప్రతినిధుల నుంచే మొదలు పెడదాం.. అంటూ కేటీఆర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలకు రేవంత్ వైట్ ఛాలెంజ్ విసిరాడు. రేవంత్ ట్వీట్‌కు ktr గట్టిగానే సమాధానం ఇచ్చాడు. నేను ఏ పరీక్షకు అయినా సిద్ధమే అని అయితే నాది నీ ఛాలెంజ్ తీసుకునే స్థాయి కాదు. మీ రాహుల్ గాంధీ వస్తాను అంటే ఢిల్లీకి పోయి ఎయిమ్స్ కు పోయి అక్కడ చేయించుకుంటా మీరు సిద్ధమా అంటూ రిప్లే ఇచ్చాడు. నాకు క్లీన్ చిట్ వస్తే రాజీనామా చేస్తావా అంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకు పడ్డాడు.
రేవంత్ వరుస మీయింటిగ్లతో ప్రభుత్వం పైనే కాకుండా నాయకుల మీద రెచ్చిపోతూ ప్రజాలను కాంగ్రెస్ వైపు తిప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఏకంగా కేసీఆర్ అడ్డ గజ్వేల్‌లో భారీ సభ పెట్టి టీఆర్ఎస్ నేతలకు గట్టి సవాలే విసిరాడు. అప్పటి వరకు అధికార పక్షం నుంచి గానీ.. ktr నుంచి గానీ రేవంత్ మాటలను పట్టించుకున్న నాథుడే లేడు. ఇక గజ్వేల్ సభ తర్వాత ఏకంగా ktr సార్ రంగంలోకి దుకాడు. మాటకు మాట సమాధానం ఇస్తు ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు వేస్తున్నాడు. అయితే ఒక విధంగా చూస్తే ఇవన్నీ రేవంత్ గీసిన స్కెచ్ లోని బాగానే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేటీఆర్ ఎంతగా రెచ్చిపోతే అది. అంతగా రేవంత్ కు లాభం తెస్తుందనేది మాత్రం నిజమే.
డ్రగ్స్ టెస్టు చేయించుకోవడానికి నేను సిద్ధమే రా గన్ పార్క్ దగ్గరకు అక్కడి నుంచి పోదాం టెస్టు కి అంటూ రేవంత్ తన అనుచర గణాన్ని తీసుకుని ఉదయాన్నే అమరవీరుల స్థూపం దగ్గర కూర్చున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మధ్యాహ్నం వరకు అక్కడే ధర్నా చేశారు. అయితే రేవంత్ విసిరిన సవాలును కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాత్రం అక్కడి కి వచ్చాడు. తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను అంటూ రాబోయే ఎన్నికల్లో ప్రతి రాజకీయ నాయకుడు తమ ప్రోఫర్మ లో డ్రగ్స్ టెస్ట్ చేయించుకునే చేయాలి అన్నారు. అక్కడితో ఆగకుండా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు, బీఎస్పీలో కొత్తగా చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు white ఛాలెంజ్ విసిరాడు.
ఇప్పటికే పాదయాత్రలో బిజీగా ఉన్న బండి సంజయ్ కేటీఆర్‌కు మరో సవాల్ విసిరాడు. దమ్ముంటే నా పైన రాజద్రోహం పెట్టండి అంటూ రెచ్చిపోయారు. నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రమే అక్రమ మనుషుల రవాణాలో మొదటి స్థానంలో ఉంది ఆ పాపం కేసీఆర్ ది కాదా అంటూ మరో ట్వీట్ ఎక్కుపెట్టాడు. తనతో పాటు టెస్టుకు కేసీఆర్ కూడా రావాలని అప్పుడు నిజాలు బయట పడతాయి అని స్ట్రాంగ్‌గానే మాట్లాడాడు. అయితే జైల్లో చిప్ప కూడు తిన్న నాయకులతో, మాకు సవాల్ ఏంటి అంటూ కేటీఆర్ కూడా అదే స్థాయిలో రిప్లే ఇచ్చారు. ఇక ఓటుకు నోటు కేసులో ఎవరెంటో ప్రజలకు తెలుసని వాళ్లు కొత్తగా నీతులు చెబుతున్నారు అని ట్విట్టర్ లో ktr గట్టి సమాధానమే ఇచ్చారు.
ఇప్పుడు ఈ వైట్ ఛాలెంజ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. రేవంత్ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న ప్పటి నుంచి దూసుకుపోతున్నాడు అనేది మాత్రం వాస్తవం. అయితే కేసీఆర్‌పై ఇంతగా రెచ్చిపోతున్న ఆ పార్టీ నాయకులు కేవలం తాటాకు చప్పుళ్లకు మాత్రమే చేస్తున్నారు ఎందుకు అని ప్రజల మెదళ్లలో అర్థం కానీ ప్రశ్నగా మిగిలిపోయింది. దాంతో పాటు ఏకంగా కేసీఆర్ నే లై డిటెక్టర్ టెస్టుకు రా అని పిలవడం భారీ సభల్లో అనుచిత మాటలు మాట్లాడడం దగ్గరి నుంచి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని రేవంత్ బాగానే వాడుకున్నారు అనే టాక్ కూడా మంచిగానే వినిపిస్తోంది.
సినిమా రంగంలో మొదలైన డ్రగ్స్ కలకలం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఇంకో వైపేమో సినిమా వాళ్లకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఒక్క వైట్ ఛాలెంజ్ విషయంలో మాత్రమే కాదు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అన్ని నెక్ట్స్ ఎలక్షన్‌కి ఇప్పటి నుంచే పనులు మొదలు పెట్టారు. అందుకే కేటీఆర్ తో సహా ప్రభుత్వంపై టైం దొరికిన ప్రతిసారీ ఏకి పారేస్తున్నారు. దేశంలో చాలా చోట్ల డ్రగ్స్ పట్టుబడుతుండడం దానికి మూలాలు హైదరాబాద్‌లో దొరుకుతుందడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ వైట్ ఛాలెంజ్ ల పుణ్యాన గా డ్రగ్స్ దందాకు ఏదైనా పరిష్కారం దొరికితే అదే చాలు అనుకుంటున్నారు పబ్లిక్.. అయితే మంత్రి కేటీఆర్ పైన విమర్శలు ఆపాలని మంగళవారం హైకోర్టు ఇంజక్షన్ అనే ఆర్డర్ ఇచ్చింది. మరోవైపు కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ లీడర్లు రేవంత్‌రెడ్డి ఇంటిపై దాడికి వెళ్లడం.. వారిని కాంగ్రెస్ లీడర్లు ప్రతిఘటించడం చూస్తే ఈ సెగ ఇప్పట్లో తగ్గేలా కనిపిండం లేదు.