ముత్తిరెడ్డి నీ ఇంట్లో ఆడపడుచులు లేరా!
– బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్రెడ్డి
జనగామ, చౌరాస్తా : ‘ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నీ ఇంట్లో ఆడపడుచులు లేరా.. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఖబడ్ధార్..’ అని బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుల్ల దశమంత్రెడ్డి హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై పరుష పదజాలంతో మాట్లాడిన ముత్తిరెడ్డిపై పట్టణంలోని పార్టీ ఆఫీస్లో నిర్వహించిన ప్రెస్ మీట్ ఆరుట్ల ఫైర్ అయ్యారు. ముత్తిరెడ్డిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు నియోజకవర్గ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అసమర్థ, అవినీతి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ముత్తిరెడ్డే అని ఎద్దేవా చేశారు. చాతనైతే నిధులు తెచ్చి అభివృద్ది చేయాలని సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చి ఫండ్స్ నీ ఫాం హౌస్కు రోడ్డు వేసుకుని తమపైనే విర్శమర్శలు చేస్తావా అంటూ మండిపడ్డారు. దమ్ముంటే కేంద్రం ఫండ్స్ పై జనగామ చౌరస్తాలో చర్చకు రావాలన్నారు. సమావేశంలో బీజేపీ లీడర్లు ఉడ్గుల రమేశ్, సౌడ రమేశ్, పెద్దోజు జగదీశ్, కాసుల శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్
ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన