జనగామ, చౌరాస్తా : జనగామ మండలం చీటకోడూరులోని (chitakoduru) రామప్ప కుంట నుంచి మట్టి తరలిస్తున్న వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు సాదం మదన్ మోహన్, బాల్నె ఉమాపతి, రావుల రఘు, బాల్నె ప్రవీణ్ మాట్లాడుతూ చీటకోడూరు (chitakoduru) రామప్ప దేవాలయం సమీపంలో నిర్మించిన చెక్ డ్యాం నాణ్యత లేకుండా కట్టారని తెలిపారు. దీంతో గత వర్షాకాలం సైడ్ బర్మ్ తెగిపోయిందన్నారు. కాంట్రాక్టర్ తెగిన కట్టకు మళ్లీ రిపేర్ చేసేందుకు కుంట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నాడని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్న ఈ పనులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)