- నాటి ‘ఏసిరెడ్డి’ నుంచి నేటి ‘ముత్తిరెడ్డి’ వరకు వారిదే హవా!
- అన్ని పార్టీల్లోనూ పాతుకుపోయింది వారే..
- ప్రజల ముందే రాజకీయ వైరం.. తెర వెనుక అందరూ ఒక్కటేనట!
- బహుజనులను ఎదగకుండా అణచివేస్తున్నారా..?
జనగామ.. ఉద్యమాల పురిటి గడ్డ.. తెలంగాణ సాయుధ పోరాటం మొదలు.. వీర భైరాన్పల్లి కొట్లాట, రైతు కూలీ ఉద్యమం, భూ ఉద్యమాలకు నెలవు ఈ నేల.. అలాంటి పేరున్న నేలలలో ఇప్పుడు అగ్రవర్ణాల రాజ్యం నడుస్తోంది. 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏన్నో ఏళ్లులగా పాలితులుగానే ఉంటూ.. 10 శాతం కూడా లేని రెడ్లే పాలకులుగా చెలామణి అవుతున్నారు.
ఆది నుంచి వారే..
జనగామలో మొదటి నుంచీ రెడ్డీల ఆధిపత్యం సాగుతోంది. అంగ బలం, ఆర్థిక బలంతోనో, పలుకుబడితోనో ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకుంటూ బహుజనులపై అధికారం చెలాయిస్తున్నారు. జనగామ నియోజకవర్గ ఆవిర్భావం1957 నుంచి నేటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే అందులో ఏడు సార్లు రెడ్లే అధికారం చేపట్టారు. 1954లో గోపాల్ రెడ్డి, 1978లో వరదారెడ్డి, 1983 లక్ష్మారెడ్డి, 1985లో ఏసిరెడ్డి నర్సింహారెడ్డి, 1994లో చారగొండ రాజిరెడ్డి, 2014, 2018లో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎమ్మెల్యేలుగా చలామణి కాగా, వీళ్ల చేతిలో ఓడిన సమీప ప్రత్యర్థుల్లో కూడా ఏడుగురు రెడ్లే.. ఇప్పుడు జనగామ నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఒకప్పటి చేర్యాల నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. 1962 నుంచి 2008 ఉప ఎన్ని వరకు10 సార్లు ఎన్నికలు జరిగితే.. ఇందులో ఆరుసార్లు రెడ్లే ఎమ్మెల్యేలుగా గెలిచారు. నిమ్మ రాజిరెడ్డి నాలుగు సార్లు, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రెండు సార్లు అధికారం పంచుకున్నారు. 1999 లో మాత్రమే ఒక్క బహుజన బిడ్డ నాగపురి రాజలింగం ఎదురొడ్డి నిలిచి ఎమ్మెల్యేగా గెలిచారు.
పార్టీల వారీగా..
తాము ఎప్పుడూ పేదల పక్షానే నిలుస్తామని, శ్రమజీవుల కోసం కొడ్లాడుతామని చెప్పే కమ్యూనిస్టు పార్టీల్లో కూడా జనగామలో రెడ్లదే రాజ్యం. గతంలో ఏసిరెడ్డి నర్సింహారెడ్డి (1985), చారగొండ రాజిరెడ్డి (1994) సీపీఎం నుంచి ఎమ్మెల్యేలుగా ఉంటే, 2018లో ఆముదాల మల్లారెడ్డి సీపీఐ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నుంచి గతంలో కొమ్మూరి, ఇప్పుడు ముత్తిరెడ్డి అధికారం చలాయించారు. ఇక కేంద్రంలో బీసీల పార్టీ అని చెప్పుకునే బీజేపీలోనూ జనగామలో రెడ్లదే హవా కొనసాగుతోంది. గతంలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన కేవీఎల్ఎన్ రెడ్డి, దశమంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా తెర మీదకు వచ్చిన ముక్కెర తిరుపతిరెడ్డి సహా అందరూ రెడ్డీలే.. కాంగ్రెస్లో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇటీవల జనగామ డీసీసీ అధ్యక్షుడిగా ఆ పార్టీలో కీలకంగా మారారు. గతంలో డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన జంగా రాఘవరెడ్డి కూడా అదే సమాజికవర్గం కావడం గమనార్హం.
నామినేటెడ్ పోస్టులు వాళ్లకేనా?
ప్రత్యక్ష ఎన్నికల్లో ఆర్థిక బలంతో అందరినీ అణగదొక్కి అన్ని పార్టీల్లో ముందు ఉంటున్న రెడ్లు.. నామినేటెడ్ పోస్టులను సైతం వారి ఖాతాలోనే వేసుకుంటున్నారానే ఆరోపణ ఉంది. పాగాల సంపత్రెడ్డిని జనగామ జడ్పీ చైర్మన్ గా చేయడంతో పాటు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పీఠం కూడా ఆయనకే కట్టబెట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎడవెల్లి కృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఇర్రి రమణారెడ్డి పాగా వేశారు. గతంలో కొమురవెల్లి ఆలయ చైర్మన్గా కూడా బద్దిపడగ కృష్ణారెడ్డిని నియమించాడు. అయితే బీఆర్ఎస్ పార్టీలో నియోజకవర్గం మొత్తంలో ఏ ఒక్క మండలంలో అర్హులైన బహుజన లీడర్లే లేరా? ఆ పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారు. జనగామలో దాదాపు అన్ని పార్టీలోనూ రెడ్లే పెత్తనం చెలాయిస్తూ బహుజనులను ఎదగనీయడం లేదని పలువురు బీసీ, ఎస్సీ, ఎస్టీ లీడర్లు లీడర్లు వేదన చెందుతున్నారు.
ప్రజల ముందే వైరం.. తెరవెనుక అంతా ఒకటేనట..! (త్వరలో..)
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్
ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన