- జనగామ డీసీసీలో డిష్యం.. డిష్యం..!
- రసాభసగా కాంగ్రెస్ లీడర్ల మీటింగ్
- నువ్వువెంత అంటే నువ్వువెంత అనుకున్న నేతలు
- గందరగోళంలో క్యాడర్
చౌరాస్తా ప్రతినిధి, జనగామ : కాంగ్రెస్ అంటేనే ఒక స్వేచ్ఛయుత పార్టీ. ఇక్కడ క్యాడర్ నుంచి లీడర్ వరకు ఎవరు ఏం మాట్లాడినా.. ఏం చేసినా అంతా లైట్‌గా తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భంగా అవి కాస్త శృతి మించి ఎంతటి వరకైనా దారి తీస్తాయి. జనగామ కాంగ్రెస్‌లో అదే జరిగినట్ట తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారం వచ్చిన నాలుగు రోజులు కాలేదు అప్పుడే జనగామ కాంగ్రెస్ నేతల్లో ప్రోటోకాల్ రగడ మొదలైంది. సోమవారం జరిగిన కార్యకర్తల సమీక్షలో ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అంటూ నేతల మధ్య మాటామాట పెరిగి తన్నుకునుడు ఒక్కటే తక్కవ అన్నట్టు వ్యవహరించినట్టు తెలుస్తోంది.
అసలు కథ ఇది
జనగామలోని డీసీసీ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకునేందుకు డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సోమవారం సమావేశం నిర్వహించినట్టు సమాచారం. ఈ మీటింగ్‌లో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కొందరు పాల్గొన్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ సీనియర్ లీడర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, వేమళ్ల సత్యనారాయణరెడ్డి మరి కొందరు నేతలు ఇటీవల మంత్రులు కోమటిరెడ్డి వెంకత్రెడ్డి, ఉత్తమ్ కుమారెడ్డిలను కలిసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఈ విషయం సమావేశంలో చర్చకు రావడంతో కొమ్మూరి తనకు సమాచారం ఇవ్వకుండా, ప్రొటోకాల్ పాటించకుండా నాయకులు ఇలా వ్యహరించడం సరికాదని అన్నట్లు తెలిసింది. మరోసారి ఇలాంటి చేయకూడదని హుకుం జారీ చేసినట్టు సమాచారం. దీంతో కొమ్మూరి, ఎర్రమల్ల సుధాకర్ మధ్య మాటామాట పెరిగి వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. నేతలిద్దరు ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో కొద్దిసేపు కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇక పట్టణంలోని ఓ వార్డు ఎన్నికల ప్రచారంలో అవకతవకలపై ఆ కౌన్సిలర్‌ను నిలదీయడం కూడా సభలో రసాభసకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొమ్మూరి వద్ద పనిచేస్తున్న ఒకరికి దేశుద్ది చేశారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పార్టీ అధికారంలోకి వచ్చిన వారం కాముందే జనగామ కాంగ్రెస్‌లో భేదాభిప్రాయాలు, కుమ్ములాటలు మొదలు కావడంతో పార్టీ క్యాడర్ ఆయోమయం మొదలైంది.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్
ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన