తెలంగాణ, చౌరాస్తా :-వీధి కుక్కల దాడిలో ఐదు నెలల బాబు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. షేక్‌పేట్ వినోబా నగర్లో అనూష, అంజి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఐదు నెలల బాబు శరత్ ఉన్నాడు. అయితే ఈ నెల 8న బాబును గుడిసెలో పడుకోబెట్టి తల్లిదండ్రులుపొట్ట కూటికోసం కూలి పనికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి బాలుడు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి ఏడుస్తూ కనిపించాడు. వెంటనే శరత్‌ను హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నీలోఫర్‌కు తరలించారు. అక్కడే శరత్ చికిత్స పొందుతూ 17 రోజుల తర్వాత మృతి చెందాడు.