
హైదరాబాద్, చౌరాస్తా :తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా వైరస్ తో ఇద్దరు మృతి చెందారు. ఏడాదిన్నర తర్వాత తెలంగాణలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది.తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈసారి జేఎన్ 1 రూపంలో వచ్చిన కొవిడ్ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా వైరస్ కారణంగా తెలంగాణలో రెండు మరణాలు సంభవించాయి. ఏడాదిన్నర తర్వాత తెలంగాణలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది.
హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఊపిరిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చేరిన రోగి మృతి చెందాడు. అయితే వ్యాధి తీవ్రం కావడం వల్లే పేషెంట్ ప్రాణాలు కోల్పోయాడని ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర చెప్పారు. అయితే అతడి కొవిడ్ టెస్టులు చేయగా.. అందులో పాజిటివ్ గా నిర్దారణ అయింది. మరోవ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించాడు. అతడికి కూడా వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో వైద్యులు అప్రమత్తమయి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ హాస్పిటల్ లో ఇద్దరు పీజీ డాక్టర్లు కొవిడ్ బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)