- 28 రోజులకు రూ.3.15 కోట్లు ఆదాయం
- 100 గ్రాముల బంగారం, 4.25 కిలోల వెండి కానుకలు
యాదాద్రి, చౌరాస్తా : శ్రీయాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి హుండీని గురువారం లెక్కించారు. 28 రోజుల హుండీల్లో స్వామారికి రూ.3,15,05,035లు వచ్చినట్టు యాదాద్రి దేవస్థానం కార్యనిర్వహణాధికారి తెలిపారు. వీటితో పాటు 100 గ్రాముల మిశ్రమ బంగారం, 4.25 కిలోల మిశ్రమ వెండి కానుకల రూపంలో వచ్చినట్టు తెలిపారు. ఇందులో విదేశీ కరెన్సీ కూడా ఉన్నట్టు చెప్పారు.