లింగాలఘణపురం, చౌరాస్తా :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో రాణి లక్ష్మీబాయి ఆత్మ రక్ష ప్రశిక్షణ కార్యక్రమం పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలికలకు మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. జనగామ డీఈఓ రాము, జీసీడీవో గౌసియా బేగం పర్యవేక్షణలో రెండు నెలలుగా ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ సందర్భంగా లింగాలఘణపురం మండలంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం, నెల్లుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విక్టరీ షోటోకాన్ కరాటే మాస్టర్ ఓరుగంటి సంతోష్ కుమార్ శిక్షణ ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థినులు అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని ఎస్వో అన్నపూర్ణ, పీఈటీ విజయలక్షి తెలిపారు.