- బాధ్యుడైన అధికారి సస్పెండ్
ప్రజాపాలన దరఖాస్తులను నిర్లక్ష్యం చేసినందుకు ప్రభుత్వం ఓ అధికారిని సస్పెండ్ చేసింది. హయత్ నగర్ ఏరియా దరఖాస్తులు బాలానగర్ సమీపంలో లభించాయి. దీనికి ఓ అధికారి నిర్లక్ష్యమే కారణమని గుర్తించింది. దీంతో సదురు అధికారిపై వేటు వేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఘటనపై స్పందించారు. సరైన వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరారు.
ఫ్లైఓవర్‌పై దరఖాస్తులు…
బాలానగర్ ప్లైఓవర్‌పై ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు దర్శనమిచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ బాధ్యతను ప్రభుత్వం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది. ర్యాపిడో వెహికిల్‌పై దరఖాస్తులను తరలిస్తుండగా అవి రోడ్డుపై పడిపోయాయి. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలానికి చెందిన దరఖాస్తులుగా గుర్తించడం జరిగింది.