- ప్రముఖ వ్యాపారవేత్త గజ్జి మధు
జనగామ, చౌరాస్తా : అమ్మాయిలు బాగా చదువుకుని అన్నిరంగాల్లో రాణించాలని ప్రముఖ వ్యాపారవేత్త గజ్జి మధు అన్నారు. సంక్రాతి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ బాలకలు కళాశాలలో చదువే 300 మంది విద్యార్థినులకు బుధవారం ఆయన బట్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మధు మాట్లాడుతూ ప్రభుత్వ బాలకలు కళాశాల్లో చదువుకునే విద్యార్థినుల కళ్లల్లో సంక్రాతి వెలుగులు నింపాలని 2017 నుంచి ఈ బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బాలికా విద్యాను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలన్నారు. అమ్మాయిలు కూడా తాము ఏ విషయంలో తక్కువకాదని అబ్బాయిలతో పోటి- పడి చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి.మంజుల, సీడీసీ చైర్మన్ గట్టు, బెలిదె శ్రీధర్, లెక్చరర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)