జనగామ, (చౌరాస్తా న్యూస్) : ఈ నెల 30న జనగామ జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ జూనియర్ బాల బాలికల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్టు సాఫ్ట్ బాల్ అసోషియేషన్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భగత్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్లో మంగళవారం ఉదయం 09 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. 01-01-2006 తరువాత జన్మించిన వారు ఈ ఎంపికకు అర్హులని తెలిపారు. క్రీడల్లో ఆసక్తిగా పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డుతో హాజరు కావాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఈ 6303717467, 9848910545, 9849683470 ఈ నంబర్లలో సంప్రదించాలన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)