- భువనగిరి టికెట్ రేసులో కోమటిరెడ్డి వారసుడు
- గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకున్న చంద్రపవన్ రెడ్డి
- కాంగ్రెస్ మారుతున్న రాజకీయ సమీకరణలు
జనగామ, (చౌరాస్తా ప్రతినిధి) : భువనగిరి లోకసభ సీటుకు ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. సీనియర్ లీడర్లే కాకుండా యువ నాయకులు సైతం ఈ టికెట్ కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా కొమటిరెడ్డి బ్రదర్స్ వారసుడు కొమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి కూడా భువనగిరి టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.
ఎవరు ఈ చంద్రపవన్ రెడ్డి..!
కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో కొన్ని రోజులుగా ఈ పేరు మార్మోగుతోంది. రోడ్లు భవనాలు, సినీమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోదరుల పెద్దన్న కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి కుమారుడే చంద్రపవన్ రెడ్డి.. యూఎస్‌లో ఎంఎస్ పూర్తి చేసిన ఈయన 2014లో ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ మోటర్ పేరుతో 12 బ్రాంచ్‌ల్లో మారుతి షోరూంలు ఏర్పాటు చేసి 4 వేల మందికిపైగా ఉపాధి కల్పిస్తున్నారు. ఇందులో దాదాపు అంతా యాదాద్రి భువనగిరి జిల్లా వాసులే ఉన్నట్టు తెలిసింది. ఇదే కాక పవన్ ఇన్ ఫ్రా పేరుతో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చంద్రపవన్ రెడ్డి వ్యాపారాలు ఉన్నట్టు సమాచారం. అయితే పూర్తిగా బిజినెస్ మీదే కాకుండా దాదాపు 10 ఏళ్లుగా తమ ఇద్దరు బాబాయ్‌ల రాజకీయాల్లో ఆయన కీలకంగా పనిచేస్తూ వస్తున్నారు.
చంద్రపవన్ రెడ్డి తండ్రి మోహన్‌రెడ్డికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది. మోహన్‌రెడ్డి ఒక సారి మునుగోడు జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవి చూశారు. తాజా ఆయన కుమారుడు చంద్రపవన్ రెడ్డి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. మొత్తానికి కోమటిరెడ్డి బ్రదర్స్ కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయ అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్
ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన