జనగామ, (చౌరాస్తా న్యూస్) : అంబేద్కర్ సేవా సమితి గౌరవాధ్యక్షుడు రామిని హరీష్ పుట్టినరోజు సందర్భంగా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లిగారి రాజు జనగామ రైల్వే స్టేషన్ వద్ద నిరాశ్రయులు, అనాథలకు అన్నదానం చేశారు. జనగామ పట్టణంలోని అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనా కష్టకాలంలో ప్రజలకు ఉచిత అంబులెన్స్ సేవలు అందించి, ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రస్తుతానికి డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామిని హరీష్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మల్లిగారి ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాడిశెట్టి సంతోష్, తమ్మిశెట్టి నాగరాజుప, పసునూరి రాజేష్, కొత్తపల్లి సుధాకర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.