- ఓమ్నీ వ్యాన్ నడిపిన మాజీ సీఎం
మన చౌరాస్తా, డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్టీరింగ్ పట్టారు. కొన్ని నెలల కింద కాలు ఆపరేషన్ అయిన తర్వాత కేసీఆర్ కర్ర సహాయంతో నడిచిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా కర్ర లేకుండా నడుస్తున్న కేసీఆర్కు మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్ల సూచన చేశారు. ఈ మేరకు మాజీ సీఎం తన పాత ఓమ్నీ వ్యాన్ నడిపారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.