రఘునాథపల్లి, మన చౌరాస్తా : మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రాజయ్య సమీప బంధువైన (వదిన) రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామానికి చెందిన తిప్పారపు జయమ్మ శుక్రవారం మృతి చెందారు. జయమ్మ పోలీస్ శాఖలో సూపరిండెండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురైన ఆమె శుక్రవారం కన్నుమూశారు. ఆమె స్వగ్రామైన నిడిగొండలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.