- జిల్లాలో బెస్ట్ రీజియన్ చైర్మన్‌గా రాజశేఖర్ రెడ్డి
- సెకండ్ బెస్ట్ అధ్యక్షుడిగా శ్రీభాష్యం రఘు
జనగామ, మన చౌరాస్తా : లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ 320 ఎఫ్ జిల్లాలోని 8 రీజియన్లలో బెస్ట్ రీజియన్ చైర్మన్‌గా జనగామ ఆబాద్ క్లబ్‌కు చెందిన లయన్ కదిరె రాజశేఖర్ రెడ్డికి అవార్డు లభించింది. ఆదివారం రాత్రి వరంగల్‌లోని బిర్లా ఓపెన్ మైండ్స్ పాఠశాలలో జరిగిన జిల్లా అవార్డ్స్ నైట్ సభకు జిల్లా గవర్నర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథి మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ హెచ్ రాజిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అవార్డు ప్రదానం చేశారు. 2007లో లయన్స్ సంస్థలో చేరిన రాజశేఖర్ రెడ్డి 2013–-14 లో జనగామ ఆబాద్ క్లబ్ అధ్యక్షుడిగా సేవ చేశారు. అనంతరం 2022–- 23లో జోన్ చైర్మన్ గా పనిచేసే అప్పటి జిల్లా గవర్నర్ కన్నా పరశురాములు చే ప్రశంసలు అందుకున్నారు.
ప్రస్తుతం జిల్లాలో రీజియన్ చైర్మన్ గా ప్రథమ స్థానంలో నిలిచారు. ఆబాద్ క్లబ్ అధ్యక్షుడు శ్రీభాష్యం రఘు జిల్లాలో గల 90 క్లబ్‌లలో సెకండ్ బెస్ట్ అవార్డు అందుకున్నారు. అన్న ప్రసాద వితరణ, మెంబెర్షిప్ గ్రోత్‌లో ప్రత్యేక అవార్డులందు కోగా ఈ క్లబ్ కు చెందిన గ్లోబల్ యాక్షన్ టీం సర్వీస్ విభాగం నాయకుడు వి. ప్రసాద్ రావు, గ్లోబల్ యాక్షన్ టీం విస్తరణ విభాగం నాయకుడు ఏ.భిక్షపతి, ఇంకా ఈ క్లబ్ కోశాధికారి ప్రవీణ్, జిల్లా చైర్మన్లు పబ్బ చంద్రశేఖర్, నాగబండి రవీందర్, అల్లాడి ప్రభాకర్ రావు, పులుగం సురేశ్ కమిటెడ్ లీడర్ అవార్డు అందుకున్నారు. అవార్డులు సాధించిన నాయకులను క్లబ్ పూర్వ జిల్లా గవర్నర్లు డా. డి. లవకుమార్ రెడ్డి, కన్న పరశురాములు, నూతన అధ్యక్షుడు డా. పి. నాగేశ్వర రావు, ఇతర సభ్యులు అభినందించారు.