- ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ యూనస్
స్టేషన్ ఘన్ పూర్, మన చౌరాస్తా : ‘నీట్’ పేపర్ లీకేజీకి కారణమైన దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టనున్న బంద్ కు ప్రతీ ఒక్కరు సహకరించాలని ఏఐఎస్ఎఫ్ జనగామ జిల్లా కన్వీనర్ మహమ్మద్ యూనస్ కోరారు. బుధవారం స్టేషన్ ఘనపూర్ లో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ యూఐ సంఘాల బాధ్యులు యూనస్, యాకన్న, జానీ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రమేయంతోనే నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. ఇంత పెద్ద సమస్యపై పార్లమెంట్ లో చర్చ జరగకుండా కేంద్రం తప్పుదోవ పట్టిస్తుందన్నారు. లీకులకు కారణమైన ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నీల మహేష్,అఖిల్, మహ్మద్ రియాజ్, రాము పాల్గొన్నారు.