బచ్చన్నపేట,మన చౌరాస్తా :మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంఎస్పి మండల నాయకులు పాకాల కుమ్మర స్వామి మాదిగ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి అల్వాల రాజు మాదిగ సీనియర్ నాయకులు అల్వాల నర్సింగరావు మాదిగ నల్ల అంజయ్య మాదిగ ముఖ్య అతిథులుగా పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అయితే వాటిని అమలుపరిచే విధంగా కృషి చేసిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ దేశంలో సామాజిక న్యాయం సాధన కోసం కృషిచేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రావ్ అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త స్వతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంతి కృషి చేసిన భారతదేశ ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవ బంధించిన గొప్ప మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ తను కార్మిక శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా,మరెన్నో శాఖలకుగా మంత్రిగా పని చేసి దేశ ఉప ప్రధానిగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో, మల్యాల బాల నర్సయ్య, కర్రె శ్రీనివాస్, పైసా బిక్షపతి, కొల్లూరు రవి, అల్వాల ఇస్తారి, గంధమల్ల కిష్టయ్య, మన పెళ్లి భూమయ్య, రాములు, ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు