- రూ.80 వేలు లంచం తీసుకుంటూ దొరికిన సబ్ రిజిస్టార్ సునీత
హనుమకొండ, మన చౌరాస్తా : హన్మకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్టార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు. రూ.80 వేలు లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్టార్ సునీత రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి పరకాల సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లగా సబ్ రిజిస్టర్ సునీత, ప్రవేట్ డాక్యుమెంటల్ ఆపరేటర్ బి.నరేష్ డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడరు. దీంతో అధికారులు వల పన్ని శ్రీనివాస్ నుంచి రూ.80 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.