
జనగామ, మన చౌరాస్తా : జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ మసీద్ – ఏ -హైదర్ నూతన కమిటీ ఆదివారం ఎన్నుకున్నారు. మౌలానా అబ్దుల్ హఫీజ్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా ఎం.డి ఖాదర్ షరీఫ్, కార్యదర్శిగా ఎం.డి జహంగీర్, కోశాధికారిగా ఎం.డి ఖాసింను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షుడు ఖాదర్ షరీఫ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, మసీద్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.