జనగామ, మన చౌరాస్తా : కల్చరల్ క్రియేటివ్ ఛానల్ జనగామ (సిసిసి జనగామ) ఆధ్వర్యంలో ‘ఎవరు మారాలి’ షాట్ ఫిలిం జనగామ పరిసర ప్రాంతాల్లో గురువారం చిత్రీకరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ, ఓటరు నిర్ణయంపై ప్రధానంగా ఈ లఘుచిత్రంలో పలు అంశాలు చర్చించి ప్రజలను చైతన్యం, అవగాహన కలిగిస్తారు. కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి చక్కని సందేశాన్ని చిత్రీకరించారు. ఈ లఘుచిత్రం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అయిలా సోమ నర్సింహచారి, డీవోపీ, ఎడిటింగ్ శ్రీకాంత్ నాయక్, సమన్వయ కర్త జి.కృష్ణ, నటీనటులు అయిలా సొమబ్రహ్మచారి, అయిలా సోమనర్సింహాచారి, లగిశెట్టి ప్రభాకర్, జి.కృష్ణ, దిగోజు నర్సింహచారి, దిగోజు సాంబయ్య చారి, బత్తోజు సిద్దిరాములు, గంగభవానీ, బుదారపు లావణ్య, గొలుసుల ఎల్లయ్య, అంబాల శ్రీనివాస్ గౌడ్, మల్యాల జనార్దన చారి, చిలుమోజు దక్షిణామూర్తి, సాయికిరణ్, శివనాద్ గౌడ్, సాయికుమార్, బన్నీ, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు జి.కృష్ణ మాట్లాడుతూ సిసిసి జనగామ యూట్యూబ్ ఛానెల్ లో గతంలో నిర్మించిన ‘ముదురు మొగుడు ముద్దుల పెళ్లాం’, ‘తనదాక వస్తే’ లఘుచిత్రాలు విశేషమైన ఆదరణ వస్తుందన్నారు. అదే తరహాలోనే ‘ఎవరు మారాలి’ అనే సామాజిక ఇతివృత్తంతో తీసిన ఈ లఘుచిత్రాన్ని అదరిస్తారనే విశ్వాసాన్ని వెల్లబుచ్చారు. శనివారం సాయంత్రం ఛానెల్ లో ఈ షాట్ ఫిలిం విడుదల చేస్తున్నామన్నారు.