- ప్రధాన కార్యదర్శిగా పాలమాకుల జితేందర్
- కోశాధికారిగా గుడికందుల కృష్ణ
జనగామ, మన చౌరాస్తా : డిజిటల్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ (డీఎంజేఏ) జనగామ అధ్యక్షుడిగా మన చౌరాస్తా ఎడిటర్ ఉప్పలంచి నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన డిజిటల్ మీడియా జర్నలిస్టుల సంఘ సమావేశంలో నరేందర్‌తో పాటు 12 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ప్రధాన కార్యదర్శిగా పాలమాకుల జితేందర్, ఉపాధ్యక్షులుగా బత్తిని అశోక్, దీకొండ హరీశ్, కోశాధికారిగా గుడికందుల కృష్ణ, సహాయ కార్యదర్శులుగా జేరిపోతుల ఉపేందర్, కార్యవర్గ సభ్యులుగా చిటుకుల అంజయ్య, గుండా రాజు, ప్యాట రాజు, గండి ప్రవీణ్‌కుమార్, చెల్లోజు నవీన్‌చారి, ఎక్కలదేవి ఓంకార్, ఎండీ అఫ్రోజ్ ఎన్నికయ్యారు. ఇక అసోసియేషన్‌కు గౌరవ సలహాదారులుగా సీనియర్ జర్నలిస్టులు మాదంశెట్టి శివకుమార్, కొండా శ్రీనివాస్, శీల కిరణ్‌కుమార్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ ప్రస్తుతం మీడియా రంగంలో డిజిటల్ మీడియా దూసుకుపోతోందన్నారు. ఏ చిన్న ఘటన జరిగినా.. ఏ సమాచారం అయినా డిజిటల్ మీడియా ద్వారానే ప్రజలకు ముందుగా చేరుతోందన్నారు. ఈ తరుణం ప్రధాన పత్రికలు, ఎలక్ట్రానికి మీడియా సంస్థలు కూడా డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నాయన్నారు. రాష్ట్రం దాదాపు అన్ని మీడియా సంస్థలు డిజిటల్ ఫ్లాట్‌ఫాంలోకి వచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియా హవా మరింత పెరుగుతుందన్నారు. ప్రభుత్వాలు కూడా డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఇక అసోసియేషన్ సభ్యులు తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని నరేందర్ పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిజిటల్ మీడియా జర్నలిస్టులు బి.విష్ణు, బక్క రవి, బి.సంపత్, ఎం.రవి తదితరులు పాల్గొన్నారు.