
నల్లగొండ, మన చౌరాస్తా : నల్లగొండలోని పానగల్ రోడ్డు ఉన్న భారత్ భవిత హై స్కూల్లో బయాలజీ టీచర్ గా పనిచేస్తున్న గుండ్లపల్లి సుధాకర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మోదుగు సత్తిరెడ్డి ఆధ్వర్యంలో సుధాకర్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం సత్తిరెడ్డి మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందడం చాలా గొప్ప విషయం అన్నారు. సుధాకర్ ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకుని విద్యార్థులకు ఆదర్శంగా నిలబడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మోదుగు జ్యోతి, ఉపాధ్యాయులు నాగయ్య, నాగేందర్, శ్రీనివాస్, బెంజిమెన్, మౌలానా, పార్ధు తదితరులు పాల్గొన్నారు.




