* అధ్యక్షుడిగా రాజు
* ప్రధాన కార్యదర్శిగా అంకుషావళి
జనగామ, మన చౌరాస్తా : తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జనగామ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమాపతి భవన్ లో కౌన్సిల్ మీటింగ్ కు జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మయ్య అధ్యక్షత వహించగా ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షులు ఏ.నరసింహా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ముఖ్యఅతిథు లుగా హాజరయ్యారు. కౌన్సిల్ మీటింగ్ అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి శ్రీనివాస్ వ్యవహరించగా నూతన కమిటీ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ ఎన్.ఎన్ రాజు , ఉపాధ్యక్షులుగా ఇమ్మడి అశోక్, వై.వజ్రయ్య, డి.శారద, ఏ.రాజారెడ్డి, యాద శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఎండి అంకుషావళి, కార్యదర్శులుగా యు.శ్రీహరి, శ్రీరామ్, కవిత , బి వెంకన్న, ఏం లక్ష్మణ్ జి,పి వెంకన్న ,ఎం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిలర్ గా కుర్రంల యాదగిరి, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా ఎస్ శేషగిరి రావు, అకాడమిక్ సెల్ కన్వీనర్ గా బి రాజేందర్ , మెంబర్గా శ్రీమతి సుచిత్ర ఆనంద్, జీవోల కమిటీ కన్వీనర్ గా బి. సురేందర్, మీడియా కమిటీ కన్వీనర్ గా మాచర్ల ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.