పాలకుర్తి, మన చౌరాస్తా : తెలంగాణ రాష్ట్రం లోని పేద,బడుగు బహీన వర్గలు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ లు ఏకం అయ్యి బీసీ రాజ్యధికారం వైపు అడుగులు వేసి విధంగా తీన్మార్ మల్లన్న టీం పని చేస్తుందని తీన్మార్ మల్లన్న టీం జనగామ జిల్లా కన్వీనర్ మంద దిలీప్, అలాగే జిల్లా కో కన్వీనర్ బ్రహ్మచారి అన్నారు,బీసీ వర్గానికి రాజ్యాధికారం దక్కినప్పుడు వెనుకబడిన సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి జరిగిన చోట తీన్మార్ మల్లన్న టీం కచ్చితంగా ఉంటుంది, అన్యాయం జరిగినా వారికి న్యాయం జరిగేంత వరకు తీన్మార్ మల్లన్న టీం కృషి చేయాలని సూచించారు, రాజకీయ పార్టీ లకో ప్రజా ప్రతి నిధులకో బానిసలై ప్రశ్నించే తత్వాన్ని చంపుకోవద్దని , సమానత్వపు భావజాలం,కలిగిన యువత బయటకొచ్చి గొంతు వినపడ్డప్పుడే సామాజిక సమతుల్యత సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, తీన్మార్ మల్లన్న టీం పెద్ద వoగర మండల అధ్యక్షుడు గరిగంటి నవీన్, సతీష్,ఎండి. సిరాజుద్దీన్, జిల్లా మహిళా కన్వీనర్ మంద, సరిత,మహిళా పాలకుర్తి మండల కన్వీనర్ గుంటుక నవ్య, శంకర్, సాగర్త తదితరులు పాల్గొన్నారు