బచ్చన్నపేట,మన చౌరాస్తా: హరిహర కళాభవన్లో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సమావేశంలో పదవి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘానికి జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన గుర్రపు బాలరాజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడుతూ నాపై నమ్మకాన్ని ఉంచి బాధ్యతను ఇచ్చినందుకు వల్లకాటి రాజకుమార్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడుకి హృదయపూర్వక కృజ్ఞతలు తెలియజేస్తూ, వారి కోరిక మేరకు ఈ జాయింట్ సెక్రెటరీ పదవిని తీసుకోవడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు ఏ పని అప్పజెప్పినా శిరసా వహించి ఆ పనిని దిగ్విజయంతం చేస్తానన్నారు. ఈ యొక్క పదవి ద్వారా నా బాధ్యత చాలా పెరిగిందని భావిస్తూ చేనేత కార్మికులు మరియు పద్మశాలి కులస్తులందరికీ సామాజిక, ఆర్థిక, అసమానతలు లేకుండా మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తానని అన్నారు. అలాగే చేనేత కార్మికుల పిల్లలందరికీ ఉన్నత విద్యలను అభ్యసించే దానిలో,సంక్షేమ పథకాలు అందించడానికి ముందుంటానని, తెలంగాణ చేనేత వృత్తిదారులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాపేల్లి వెంకటేశ్వర్లు,మచ్చ నరేందర్,గణపురం వెంకటేష్,మచ్చ నగేష్, వేముల మురళి,బేతి కృష్ణమూర్తి, మంగళపల్లి కృష్ణమూర్తి, వల్లాల శ్రీనివాస్,కుడికాల లక్ష్మణ్, గడ్డం సుధాకర్ తదితరులు పాల్గొనడం జరిగింది.