చేర్యాల, మన చౌరాస్తా : పట్టణ కేంద్రానికి చెందిన దొమ్మాట లచ్చవ్వ కు ప్రభుత్వం నుండి మంజూరైన 41,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శివగారి అంజయ్య బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితురాలికి చెక్కు రావడానికి కృషిచేసిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి అయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు యాదవ్, రాష్ట్ర నాయకుడు ఏర్పుల మహేష్, యాట బిక్షపతి తదితరులు ఉన్నారు.