బచ్చన్నపేట, మన చౌరాస్తా: ఇటికాలపల్లి గ్రామంలో తెల్లవారుజామున కుక్కలు ముగ్గురిపై దాడి చేయగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో ప్రతి విధీలో గుంపులు గుంపులుగా కుక్కలు ఉంటున్నాయి. రోడ్డు మీద వెళ్తు ఉంటే కుక్కలు వెంట పడడం, ద్విచక్రవాహనాల వెంట పడడంతో వాహనాల మీద నుంచి కింద పడడం జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపడానికి భయబ్రాంతులకు గురి అవుతున్నారని, ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జంకుతున్న పరిస్థితి నెలకొందని సంబధిత అధికారులు, పంచాయతి కార్యదర్శి, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోని కుక్కల సమస్యను పరిష్కారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.