
జనగామ, మన చౌరాస్తా : ప్రతిభా మీది పట్టాభిషేకం మాది అంటూ తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారాలు 2025 కు జనగామ జిల్లా నుంచి ప్రముఖ కవి లగిశెట్టి ప్రభాకర్ తో పాటూ మరో నలుగురు కవయిత్రి, చిత్రకారులు, యువకవి, మెజీషియన్ ఎంపికయ్యారు.
శ్రీశ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రైటర్స్ ఫోరం, వరల్డ్ పోయెట్రీ అకాడమీ సంయుక్త అధ్వర్యంలో ఈనెల 21న మంగళవారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో అవార్డు ప్రదానోత్సవం నిర్వహిస్తారు. ఈ మేరకు లగిశెట్టి ప్రభాకర్ సాహిత్యరంగంలో చేస్తున్న విశేషమైన కృషిని గుర్తించి ఎంపిక చేసినట్లు శ్రీశ్రీ కళావేదిక సి.ఈ.ఓ కత్తిమండ ప్రతాప్ బుధవారం జనగామకు పంపిన ఆహ్వాన లేఖలో పేర్కొన్నారు. అలాగే జనగామ జిల్లా నుంచి ప్రభాకర్ తో పాటు పురస్కారం కోసం ప్రముఖ కవయిత్రి కొట్టె శ్రీలత, ప్రముఖ చిత్రకారులు మసురం రాజేంద్రప్రసాద్, యువకవి సాయికిరణ్, మేజిషియన్ ఆనంద్ ప్రతిభా పురస్కారాలు అందుకోనున్నారు.