
జనగామ, మన చౌరాస్తా : జనగామ మండలంలో యశ్వంతపూర్ పాఠశాలలో నిర్వహించిన ప్రజ్ఞోత్సవ పోటీల్లో మరిగడి పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. విద్యార్థులు శ్రావ్య, శ్రీలేఖ, రోహన్, లక్ష్మణ్, సమీనా, అనిత, ఎల్లేష్, అక్షర, కావ్య డ్రాయింగ్, రీడింగ్, రైటింగ్, పాటలు, డాన్స్, స్పెల్ విజార్డ్, స్టోరీ టెల్లింగ్, వక్తృత్వం మొదలగు అంశాల్లో పాల్గొని ప్రతభను కనపరిచారు.
ఇంగ్లీష్ స్పెల్ విజార్డ్, రీడింగ్, మ్యాథ్స్ క్విజ్ లో బి.శ్రావ్య అత్యుత్తమ ప్రతిభ పాటవాలతో మూడు బహుమతులను గెలుచుకుని మండల విద్యాధికారి వంగాల రాజేందర్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ కృష్ణమూర్తి, వీరాంజని చేతుల మీదగా అందుకున్నట్టు ప్రధానోపాధ్యాయులు రేణుకుంట్ల మురళి తెలిపారు. పాఠశాల టీచర్స్ స్టీఫెన్, గైడ్ టీచర్ సాంబరాజు ప్రోత్సాహంతో విజయం సాధించిన విద్యార్థులను అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రజిత, సభ్యులు, గ్రామ ప్రముఖులు అభినందించారు.