
లింగాలఘణపురం, మన చౌరాస్తా : లింగాలఘణపురం మండలంలో ఎఫ్ఎల్ఎన్ ప్రజ్ఞోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. మండల కేంద్ర ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఎంఈవో పడాల విష్ణుమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి ఎఫ్ఎల్ఎన్ ప్రజ్ఞోత్సవం పోటీల్లో మండల పరిధిలోని 22 ప్రాథమిక పాఠశాలల నుంచి దాదాపు 250 మంది విద్యార్థులు, 50 మంది టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణితం క్విజ్, డ్రాయింగ్ & పెయింటింగ్, కథలు చెప్పడం & చదవడం, రాయడం, స్పెల్ విజార్డ్, సోలో సాంగ్స్, స్కిట్స్, గ్రూప్ డ్యాన్స్ వంటి పలుఅంశాలలో పోటీలు నిర్వహించగా విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను చాటుకున్నారు.
ప్రజ్ఞోత్సవంలో పాల్గొన్న చిక్కులోనిగూడెం విద్యార్థులు దేవరబోయిన సాత్విక, చిక్కుడు మధు ప్రథమ స్థానంలో, డ్రాయింగ్ & పెయింటింగ్ దేవరబోయిన యశ్వంత్ ద్వితీయ స్థానంలో, ఇంగ్లీష్ రైటింగ్ లో ప్రథమ స్థానంలో దేవరబోయిన సాత్విక, స్టోరి టెల్లింగ్ లో ద్వితీయ స్థానంలో దేవరబోయిన సాత్విక, రీడింగ్ లో చిక్కుడు లక్ష్మీ ప్రియ, సోలో సాంగ్ లో చింతల రిషికలు చక్కటి ప్రతిభను కనబరిచారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎంఈవో విష్ణుమూర్తి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మల్లిఖార్జున్, శ్రీలతలు, మెమొంటోస్, సర్టిఫికెట్స్ అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ తమ పాఠశాల కీర్తిని ఇనుమడింప చేసిన విద్యార్థులను, వారిలో ఆత్మస్థైర్యం నింపి వారి విజయానికి మార్గనిర్దేశనం చేసిన సహచర ఉపాధ్యాయులు గూడెల్లి కృష్ణకు, పిల్లలను ప్రోత్సహించి, సహకరించిన తల్లిదండ్రులను అభినందించారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)