
పాలకుర్తి, మన చౌరాస్తా : నూతన పంచాయతీ ఏర్పాటుకు సహకరించాలని లాలు తండా, జోగ్య తండా, మనకతండా, మరియు కొత్త తండా వాసులు పాలకుర్తి కాంగ్రెస్ ఇన్చార్జి ఇంచార్జ్ ఝాన్సీరెడ్డిని కోరారు. ఈ మేరకు ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆమెను కలసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు కలిగివున్న తండాలను కలిపి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదర్శ బంజారా యూత్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ నరేందర్ పవార్, మంగన్న నాయక్, యాకుబ్ నాయక్, లకపతి నాయక్, పూల్సింగ్ నాయక్, మంక్తు నాయక్, యాకుబ్ నాయక్ (గుమ్మ) సంతోష్ నాయక్,విజయ్ నాయక్, శివ నాయక్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)