
- సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీశ్
హైదరాబాద్, మన చౌరాస్తా : తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్ జేయూ) ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం త్వరలో చేపట్టబోతున్న 2కే రన్ కార్యక్రమ ప్రచార పోస్టర్ ను బుధవారం తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీశ్ సెక్రటేరియట్లోని తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులకు అభినందనలు తెలిపారు.
జర్నలిస్టుల సామాజిక బాధ్యతగా సమాజంలోని రుగ్మతలను దూరం చేసేందుకు ప్రయత్నించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ఇందు కోసం కృషి చేయాలని కోరారు. ఈ 2కే రన్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ జేయూ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఎన్యూజే (ఐ) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర నాయకులు లింగబత్తిని కృష్ణ, ముత్యం ముఖేష్ గౌడ్, వెల్తూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.