
కొమురవెల్లి, మన చౌరాస్తా : కొమరవెల్లి మండలం లోని గురువన్న పేట గ్రామానికి చెందిన వొరుగంటి సత్యమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ కుటుంబాన్ని గుర్తించి బీఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ యువ నేత, సామాజికవేత్త బొంగు రాజేందర్ రెడ్డి రూ. 5 వేల ఆర్థిక సాయం అందించారు. అనంతరం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబానికి తనవంతు ఆర్థిక సహాయం అందించాలని, పేదవారికి సహాయం చేయడంలో ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బుడిగ గురువయ్య గౌడ్, మకిలి కనకయ్య, సోషల్ మీడియా ఇన్చార్జి బుడిగ, రమేష్ గౌడ్, పచ్చిమట్ల సత్తయ్య, ఆలకుంట బాలమల్లు, ఈశ్వర్, సాయి, పవన్, మహేష్ పాల్గొన్నారు.